Janasena Corporator Hunger Strike: విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద జీవీఎంసీ 22వ డివిజన్ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తన వార్డులో వెంటనే అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తన వార్డు ప్రజలు తనపై నమ్మకంతో ఓట్లు వేసి కార్పొరేటర్ని చేశారని అన్నారు. తనపై ఉన్న కక్షతో వార్డు అభివృద్దిపై చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లలో కనీసం ఒక్క రోడ్డు కూడా తన వార్డులో వెయ్యలేదని, ఒక్క గుంత కూడా పూడ్చలేదని తెలిపారు. పిఠాపురం కాలనీలో పెట్టవలసిన యుపీహెచ్సీ సెంటర్ను మారికవలస తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నలుగురు షాడోలు జీవీఎంసీని దోచుకుంటున్నారని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. జీవీఎంసీలో అవినీతి బయటపెడుతున్నామనే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వార్డు డెవలప్మెంట్ పనులు వెంటనే మొదలు పెట్టాలని అందుకోసం ఆత్మ బలిదానానికి కూడా తాను సిద్ధమన్నారు. నిరాహారదీక్ష చేస్తున్న మూర్తి యాదవ్ వద్దకు వచ్చిన అధికార్లు, ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. జీవీఎంసీ కార్యాలయం వద్ద దీక్షలు చేయడం నిబంధనలకు విరుద్దమని పోలీసులు అడ్డుకున్నారు. నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చదవండి: