విశాఖజిల్లాలోని సింహగిరిపై ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని జనవరి 6వ తేదీన వైభవంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని.. సింహాచలం దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. సింహాద్రి అప్పన్న స్వామి ఉత్తర ద్వార దర్శనాన్నికి ఏర్పాట్లపై దేవస్థాన అధికారులు, సిబ్బందితో.. స్వామివారి కళ్యాణడపంలో సమావేశం నిర్వహించామని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశిని... అన్ని దేవాలయాల్లో నిర్వహించే రోజునే సింహాచలంలోనూ నిర్వహిస్తున్నామని చెప్పారు. ముందుగా ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు కుటుంబీకులు దర్శనం చేసుకుంటారన్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి 10:30 వరకు ఉత్తర ద్వారంలో స్వామి దర్శనమిస్తారని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
ఇదీ చదవండి:
సింహాచలంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు ముమ్మరం - విశాఖ సింహాచలం తాజా వార్తలు
జనవరి 6వ జరిగే ముక్కోటి ఏకాదశికి సింహాచలం దేవస్థానంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి ఎం. వెంకటేశ్వరరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగించకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.