విశాఖ జిల్లా పాడేరులో ఈనెల 13న జరిగిన యువతి మృతికి... ఆమె ప్రియుడే కారణమని పోలీసులు తెలిపారు. వారు వివరించిన ప్రకారం.. హుకుంపేట మండలం వంటిపాకకు చెందిన యువతి కనకరత్నం... పాడేరు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ప్రసాద్ ను ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకువచ్చిన పరిస్థితుల్లో.. అప్పటికే పెళ్లైన ప్రసాద్ ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు . జ్వరంతో బాధపడుతున్న కనకరత్నానికి అధికమోతాదులో ఇంజక్షన్ ఇచ్చాడు. ఆరోగ్యం విషమించి కనకరత్నం మరణించింది. బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళన చేయగా.. నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు.
ఇవీ చూడండి