ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - vizag crime news

విశాఖ జిల్లాలో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఐదు ట‌న్నుల రేష‌న్ బియ్యాన్ని గ్రామ‌స్థులు ప‌ట్టుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు... బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

illegal-moving-ration-rice-seize-in-vizag-district
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Oct 2, 2020, 10:27 PM IST

విశాఖ జిల్లా చింత‌ప‌ల్లి మండ‌లంలోని పిసిరిమామిడి వంతెన వ‌ద్ద ఓ వ్యాను బురద‌లో చిక్కుకుంది. వాహనాన్ని బ‌య‌ట‌కు తీసేందుకు వెళ్లిన చెరుకుంపాక‌లు, పిసిరిమామిడి గ్రామ‌స్థుల‌ు వ్యాన్​లో రేష‌న్ బియ్యం ఉండ‌టాన్ని గ‌మ‌నించారు. వెంట‌నే రెవెన్యూ అధికారుల‌కు స‌మాచారం అందించారు. చింత‌ప‌ల్లి ఆర్​ఐ బాల‌రాజు దొర‌, వీఆర్వో తుల‌సీ తదితరులు సంఘ‌ట‌నా స్థలానికి వెళ్లి రేష‌న్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీచదవండి.

ప్రత్యేక హోదా అడగకుండా.. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.