విశాఖ జిల్లా తగరపువలసలో అక్రమంగా నిల్వ ఉంచిన 1086 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మద్యాన్ని నిల్వ ఉంచిన భార్యాభర్తలైన చోడి వెంకటరావు, చోడి శ్రీదేవిలను భీమిలి సీఐ జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ స్క్రాప్ దుకాణంలో అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఉపాధి నిధులపై హైకోర్టు విచారణ రెండు వారాలు వాయిదా