విశాఖ రైల్వే స్టేషన్లో హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా కలకలం రేపింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ గ్యాంగ్.... హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఈ మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వేస్టేషన్లో 7వ నెంబరు ఫ్లాట్ ఫారంపై ఉన్న హౌరా- యశ్వంత్ పూర్ రైల్లో వీరు ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. ఈ ముఠాలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు.
ఇవీ చదవండి