విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం మంగబంద-చుట్టుమెట్ట రహదారిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ భారీ వృక్షాన్ని నేలకూల్చారు. దాంతో రహదారిలో గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డంకులు తొలగించారు. మావోయిస్టు మిలీషియా సభ్యులే రోడ్డుకు అడ్డంగా చెట్టును నరికి వేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో మన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఇదీ చదవండి: నర్సీపట్నంలో టఫ్ ఫైట్.. బరిలో అగ్ర నేతల కుటుంబసభ్యులు