"ఈ- రక్షాబంధన్" కార్యక్రమానికి మూడు రోజులుగా విశాఖ నగరం నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సీఎం మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, రాఖీ పౌర్ణమి రోజున మహిళలకు కానుకగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నెలవారీ షెడ్యూల్లో భాగంగా... సైబర్ స్పేస్ "ఈ- రక్షాబంధన్" ను ఆన్ లైన్ లో అధిక సంఖ్యలో నగర విద్యార్థినులు, మహిళలు, మహిళా పోలీసులు వీక్షిస్తున్నారని సీపీ ఆర్కే మీనా తెలిపారు. 30 రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళల, విద్యార్థులకు... ఆన్ లైన్ లో నేరాలు చేసే వారి భారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మోసాలను ఏ విధంగా ఎదుర్కోవాలో ఆయా రంగాలలో ప్రముఖులతో యూట్యూబ్ ఛానల్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, విద్యార్థినులు యూట్యూబ్ లైవ్ కామెంట్ల రూపములో తమ హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు. అతివలకు, విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగపడే ఈ అవగాహన సదస్సులను అందరూ వీక్షించి, సైబర్ నేరాల భారిన పడకుండా జాగ్రత్త వహించాలని సీపీ సూచించారు.
ఇదీ చదవండి: