ETV Bharat / state

రుషికొండ తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కమిటీ వేయాలి:హైకోర్టు - రుషికొండ తవ్వకాలపై కమిటీ

HC ON RUSHIKONDA :రుషికొండ తవ్వకాలపై ఏర్పాటు చేసిన కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ముగ్గురు అధికారులు ఉండటంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండటం సరికాదని వ్యాఖ్యానించింది. కమిటీపై పునఃపరిశీలించాలని.. కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు సూచించింది.

HIGHCOURT ON RUSHIKONDA
HIGHCOURT ON RUSHIKONDA
author img

By

Published : Dec 14, 2022, 1:01 PM IST

Updated : Dec 15, 2022, 7:50 AM IST

HIGHCOURT ON RUSHIKONDA : విశాఖలోని రుషికొండ అక్రమ తవ్వకాలపై నిజాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఏర్పాుచ చేసిన కమిటీలో... ఏపీ ప్రభుత్వ శాఖలకు చెందిన ముగ్గురు అధికారులు ఉండటంపై.. హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. విచక్షణారహితంగా కొండను తవ్వేశారని రాష్ట్ర ప్రభుత్వమే ఆరోపణ ఎదుర్కొంటోందని... అధికారులపైనా కోర్టు ధిక్కరణ దాఖలయిందని గుర్తుచేసింది. అలాంటప్పుడు... రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కమిటీలో స్థానం ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది. కమిటీ ఏర్పాటుపై పునఃపరిశీలించాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్‌ N.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

రుషికొండ తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కమిటీ వేయాలి

విశాఖలోని రుషికొండను పర్యావరణ పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో విచక్షణారహితంగా తవ్వేస్తూ, పరిధికి మించి నిర్మాణాలు చేస్తున్నారంటూ.. విశాఖ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్‌ పీవీఎల్​ఎన్​ మూర్తి యాదవ్‌.. హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరి తన వాదనలు వినాలని ఇంప్లీడ్ పిటిష్‌ దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు.. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించేందుకు కేంద్ర, పర్యావరణ, అటవీశాఖకు చెందిన బాధ్యతాయుతమైన అధికారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

బుధవారం జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కమిటీని ఏర్పాటు చేశామని.. త్వరలో సర్వే ప్రారంభిస్తుందని తెలిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్​ మూర్తి వాదనలు వినిపిస్తూ.. ఏపీ కోస్టల్ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, టౌన్‌, కంట్రీ ప్లానింగ్‌ శాఖ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు చెందిన విజయవాడలోని ఇంటిగ్రేటెడ్‌ రీజనల్‌ ఆఫీస్‌ అధికారి, నేషనల్ సెంటర్ ఫర్‌ సస్టెయినబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌కు చెందినవారు కమిటీలో సభ్యులుగా ఉన్నారన్నారు. అందులో ముగ్గురు ఏపీ ప్రభుత్వ శాఖల అధికారులని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. తవ్వకాలపై... రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ ఎదుర్కొంటుంటే... దానిపై సర్వే చేసే కమిటీ రాష్ట్ర అధికారులకు స్థానం కల్పించడం సరికాదని వ్యాఖ్యానించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది

ఇవీ చదవండి:

Last Updated : Dec 15, 2022, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.