విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముంచంగిపుట్టు మండలం బంగాపుట్టుకు చెందిన స్థానికులు జీపులో బిర్రిగూడ వాగును దాటుతుండగా.. అందులో చిక్కుకుపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ జీపు నుంచి అందరినీ దింపివేయగా ప్రమాదం తప్పింది. తర్వాత ట్రాక్టర్ తెచ్చి జీపును ఒడ్డుకు చేర్చారు. వాగులో చిక్కుకున్న ద్విచక్ర వాహనాలనూ ప్రమాదకర స్థితిలో స్థానికులు ఒడ్డుకు తెచ్చారు.
వర్షాలకు తరచూ ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగులు, వంకలపై వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: