విశాఖలో పర్యావరణ ప్రేమికులు వినూత్న నిరసన చేపట్టారు. పర్యావరణ హితం కోరే యువతి యువకులు వాతావరణాన్ని కలుషితం చేసే భార లోహాలను వినియోగించొద్దని కోరారు. వన్యప్రాణుల నివాస ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేయవద్దని నినదించారు. విశాఖ కాళీమాత ఆలయ సమీపంలో ప్రచార సామగ్రితో ప్రజల్లో చైతన్యం కల్పించారు. వాయిద్య ప్రదర్శనతో తమ ఉద్యమ ఆకాంక్షను తెలియజేసారు. ఫ్రాన్స్ తరహాలో మనదేశంలో కూడా వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు. అకాల వరదలు, తుఫానులు, ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయని వాటి సంఖ్య పెరగకుండా ఉండాలంటే పర్యావరణ సమతుల్యత పాటించాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు పర్యావరణ ఒప్పందాలను అమలు చేయాలని కోరారు.
ఇదీచదవండి