విశాఖ జిల్లాలోని దేవరాపల్లిలో ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. సంబంధిత భవనాల పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం యాదవుల కాలనీలో అద్వాన్నంగా ఉన్న మురుగు కాలువ పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విప్ వెంట అధికారులు, వైకాపా నాయకులు ఉన్నారు.
ఇదీ చదవండి: