విశాఖ జిల్లాలో భూసేకరణపై నిరసన వెల్లువ కొనసాగుతూనే ఉంది. పద్మనాభం మండలం అనంతవరం, విజయరాంపురం, తునివలస, నరసాపురం, గంధవరం, మద్ది, రెడ్డిపల్లి రెవెన్యూ గ్రామాల్లో 515 ఎకరాల ఆక్రమణ, డి-పట్టా భూములకు ప్రభుత్వం భూసమీకరణ చేపట్టింది. ప్రతి రెవిన్యూ గ్రామంలో రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ గోడును అధికారులకు వెలిబుచ్చుతున్నారు. ల్యాండ్ పూలింగ్ ను నిరసిస్తూ... పద్మనాభం తహసీల్దార్ కార్యాలయానికి సుమారు 207 మంది రైతులు భూ సమీకరణ కు వ్యతిరేకంగా ఫారం-2 దరఖాస్తులను అందజేశారు. మొదట దరఖాస్తులను తీసుకునేందుకు అధికారులు అంగీకరించని కారణంగా.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకుని బతుకుతున్నామని... ఇప్పుడు ఉన్నఫళంగా భూమిని ప్రభుత్వానికి అప్పగించిమంటే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: