విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అఫ్గానిస్థాన్ పరిస్థితులకు వ్యతిరేకంగా ఆ దేశానికి చెందిన విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. పంజ్ షేర్‌కి తమ మద్దతు ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌లో మానవ హక్కులు, మహిళా హక్కులు లేవని ఆవేదన చెందారు. తాలిబన్ల కారణంగా అఫ్గానిస్థాన్ పూర్తిగా నాశనమైందని విచారం వ్యక్తం చేశారు. తాలిబన్లలో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారని.. అందుకే వారికి పాలన తెలియదని అభిప్రాయపడ్డారు. తాలిబన్లు ఆక్రమించిన తర్వాత.. అక్కడ ప్రజలు ఉండలేక విమానాలను పట్టుకున్న పరిస్థితులు టీవీలో చూసి చలించిపోయామని ఆవేదన చెందారు.
అఫ్గానిస్థాన్ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని ఆ దేశ విద్యార్థులు కోరారు. భారత్ అఫ్గానిస్థాన్‌కు బాసటగా నిలవాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము అక్కడకు వెళ్లలేమని.. ఇక్కడే విద్య అభ్యసించడానికి సహకారం ఇవ్వాలని కోరారు. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు చూస్తే ఆందోళనగా ఉందని విద్యార్థులు ఆవేదన చెందారు.
ఇదీ చదవండి: