Fishermen Protest At Visakha Container Terminal : విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారుల ఆందోళన చేపట్టారు. ఈ పరిణామంతో విశాఖ కంటైనర్ టెర్మినల్ మెయిన్ గేటు వద్ద మత్స్యకారులు ధర్నాకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఆ పరిసరాల్లో భారీగా మోహరించారు. మరో వైపు భారీగా మత్స్యకారులు కంటైనర్ టెర్మినల్ వద్దకు చేరుకుని నిరసన చేస్తున్నారు. ధర్నా దృష్ట్యా కంటైనర్ టెర్మినల్‌కు వెళ్లే మార్గం బ్లాక్ అయ్యింది.
Fishermen Agitation for Demand to Fulfill the Promises : గత 20 ఏళ్ల క్రితం విశాఖ కంటైనర్ టెర్మిన నిర్మాణ సమయంలో తమ గ్రామాన్ని వదిలి, భూములిచ్చిన సమయంలో 60 గజాల ఇంటి స్థలం, లక్ష రూపాయల పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని పోర్ట్ హామీ ఇచ్చిందని మత్స్యకార నేతలు గుర్తు చేశారు. 20 ఏళ్లు గడిచినా ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు పరచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 సార్లు చర్చలు జరిగిన కూడా ఫలితం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. పోర్ట్ హామీ ఇచ్చి ఏళ్లు గడిచినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సచివాలయంలో దరఖాస్తు చేస్తే సెంటు భూమి ఇస్తామంటురని తెలిపారు. ఫలితంగా నిర్వాసితులు, మత్స్యకార నేతలు ఆందోళనకు దిగారు.
Vizag: విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారుల ఆందోళనలు..
"మా ముందు వారు అంబలి తిని అయిన మా పిలల్ని చదివించారు. ఇప్పుడు మా పిల్లలను చదివించుకోలేక ఉన్నాం. మా పెద్దలు ప్రస్తుతం వాచ్మెన్ జాబ్ చేస్తున్నారు. చంపేసిన మీ ఇష్టమే.. బతికించిన మీ ఇష్టమే.. కష్టపడి బతుకుతున్నాం."- మత్స్యకారులు
ఇచ్చిన హామీలే అడుగుతున్నాం.. కొత్తవి అడగట్లేదు : విశాఖ కంటైనర్ టెర్మినల్ నిర్మాణం సందర్భంగా రెండు వేల మంది భూమిని కోల్పోయామని మత్స్యకారులు తెలిపారు. లక్ష రూపాయలు ఇవ్వాల్సిన పరిహారం 25 వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారనీ, ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, కానీ మొత్తంగా కలిపి 15 ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలే అడుగుతున్నాం.. కొత్తవి అడగట్లేదని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మత్స్యకారుడై ఉండి న్యాయం చేయడం లేదని, అలాగే మత్స్య కార శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు పక్క జిల్లాలో ఉండి కూడా న్యాయం చేయలేదని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు.
FISHERMEN PROTEST: రగులుతున్న రింగు వలల వివాదం.. రోడ్డెక్కిన మత్స్యకారులు
లాభాల్లో ఉన్న విశాఖ కంటైనర్ టెర్మినల్ మత్స్యకారుల హామీ నెరవేర్చడంలో నిర్లక్ష్యంగా ఉండటంతో మత్స్యకార నేతలు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల్ని కదిలించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
"లక్ష రూపాయలు ఇస్తామన్నారు కానీ 25 వేల రూపాయలు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు. మిగతా 75 వేల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం. ఉద్యోగాలు ఇస్తామన్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మేం ఉండబట్టే విశాఖ ఉంది.. మేం లేకపోతే విశాఖ లేదు.. అలాంటి మూల వాసుల్ని తరిమేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల్ని కదిలించి ఈ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తాం."- మత్స్యకారులు
CM Jagan Cheated Fishermen: మాట ఇచ్చి.. మడమ తిప్పి.. మత్స్యకారులను నిండా ముంచిన ముఖ్యమంత్రి జగన్