విశాఖ జిల్లాలో తొలిదశ స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 9న అనకాపల్లి డివిజన్ పరిధిలో 300 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు అందాయి. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని ఆయా మండలాలకు పంపించినట్లు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. తొలిదశ పోరు ఏర్పాట్లు చూస్తూనే.. రెండు, మూడు దశల్లో పోలింగ్ నిర్వహణపైనా దృష్టి సారించామన్నారు.
మూడో దశలో మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతితో ఆయా మండలాల్లో పోలింగ్ సమయాన్ని రెండు గంటలు తగ్గించినట్లు చెప్పారు. శాంతి భద్రతల సమస్యను దృష్టిలో పెట్టుకొని ముందుగానే ముగించబోతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: