దుండగుల దుశ్చర్యకు విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ స్టాఫ్ క్యాంటీన్ పూర్తిగా దగ్ధమైంది. ఎవరూ లేని సమయంలో దుండగులు నిప్పుపెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దావానంలా మంటలు వ్యాపించి క్యాంటీన్ షెడ్ కాలి పోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి కొంతవరకు మంటలు అదుపు చేశారు. ఇటీవల వరుస ఘటనలతో మన్యంలోని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.
ఇవీ చదవండి