ETV Bharat / state

ఇంట్లో అగ్నిప్రమాదం.. సామగ్రి దగ్ధం - అనకాపల్లిలోని ఓ ఇంట్లో షార్ట్​ సర్క్యూట్

విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఫలితంగా స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

fire accident in a home at anakapalli
ఇంట్లో అగ్నిప్రమాదం
author img

By

Published : Mar 26, 2021, 8:23 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ ఇంట్లో సన్యాసి నాయుడు కుటుంబం నివాసముంటుంది. ఇంట్లో నుంచి ఎగసిపడుతున్న మంటలను గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. సుమారు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. దీంతో చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్​ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

అయితే ఈ ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి అగ్నికి ఆహుతైందని...సుమారు రూ. 3లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:

రొయ్యల చెరువులో తిరగబడ్డ పడవ.. ఇద్దరు యువకులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.