ETV Bharat / state

విశాఖ మన్యంలో వెన్న పండు సాగు - Avocado fruit cultivation in vishaka agency news

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవకాడో పండును సాగు చేస్తున్నారు విశాఖ మన్యంలోని కొందరు రైతులు. కేవలం కిలో 80 రూపాయలకే ఈ వెన్న పండును విక్రయిస్తున్నారు.

Avocado fruit
Avocado fruit
author img

By

Published : Oct 2, 2020, 10:13 PM IST

Avocado fruit
అవకాడోలను చూపుతున్న ఓ మహిళ

విశాఖ మ‌న్యంలో లభించే మ‌ధుర ఫ‌లాల జాబితాలో తాజాగా అవ‌కాడో చేరింది. ఇప్ప‌టికే విదేశీ ఫ‌లాలైన లిచీ, డ్రాగ‌న్ ఫ్రూట్ వంటివి మ‌న్యంలో సాగ‌వుతున్నాయి. గొందిపాక‌ల ప్రాంతంలోని కొంద‌రు అభ్య‌ుద‌య రైతులు ఆరోగ్యానికి మేలు చేసే అవ‌కాడోను పండిస్తున్నారు. ఇవి ప్ర‌స్తుతం చిట్రాళ్ల‌గుప్పు వ‌ద్ద పండ్ల దుకాణాల్లో వ్యాపారులు కిలో 80 రూపాయలకి విక్రయిస్తున్నారు.

అవ‌కాడోలో ఎన్నో పోష‌కాలుంటాయి. ఈ పండు లోప‌ల భాగం అచ్చం వెన్న‌ను పోలి ఉంటుంది. అందుకే దీన్ని వెన్న‌పండు(బ‌ట్ట‌ర్ ఫ్రూట్‌) అని పిలుస్తారు. శ‌రీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తుంది ఈ పండు. ఆకుప‌చ్చ‌, న‌ల్ల‌రంగుల్లో ఇవి ఉంటాయి. ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతున్న వారికి ఇది దివ్య ఔష‌ధంగా ప‌నిచేస్తుండ‌టంతో మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంటుందని చింత‌ప‌ల్లి ఉద్యాన ప‌రిశోధ‌న‌స్థానం శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ శివ‌కుమార్ తెలిపారు. ఆహార ఉత్ప‌త్తులు, సౌందర్య సాధ‌నాల్లోనూ దీన్ని అధికంగా ఉప‌యోగిస్తున్నార‌ని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.