విశాఖ జిల్లాలో వ్యవసాయ కార్యాలయాలయాలు రైతులతో కిక్కిరిశాయి. ఖరీఫ్ వరి విత్తనాలు తీసుకోవడానికి రైతులు కార్యాలయాల వద్ద వరుస కట్టారు. చోడవరం ప్రాంతంలో ఆర్.జి.ఎల్. వరి విత్తనానికి మంచి గిరాకి ఉంది. అందుకు సరిపడా ఆర్. జి.ఎల్ విత్తనాలు అందుబాటులో లేవు. చోడవరం మండలానికి 40 టన్నుల మేర విత్తనాలు అవసరం కాగా... 18 టన్నులే అందుబాటులో ఉంచారు. ఇది రైతులపై ఒత్తిడి పెంచేసింది. అందుకే విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
ఇదీ చదవండి