విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం పరిధిలోని బొడ్డేరు నదిపై అప్పలరాజుపురం సమీపంలోని మంగళాపురం ఆనకట్టకు గతేడాది గండి పడింది. ఈ కారణంగా ఆనకట్టు పరిధిలో ఉన్న చీడికాడ, బుచ్చయ్యపేట మండలాలకు చెందిన పలు గ్రామాలకు సాగునీరు అందలేదు. ఫలితంగా పంటలు ఎండిపోతూ.. పశువులకు తాగటానికి నీరు కూడా లభించలేదు. దీంతో ఈ ప్రాంత ఆయకట్టు రైతులు, విశాఖ డైయిరీ సంయుక్తంగా నిధులను సమకూర్చారు. ఆనకట్టు గండికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి, సాగునీటిని కాలువలకు మళ్లించుకున్నారు.
ఇదీ చదవండీ..రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం