ETV Bharat / state

దేవరాపల్లి-కొత్తవలస రోడ్డు విస్తరణ.. ప్రయాణికులకు తీరనున్న ఇక్కట్లు

కొత్తవలస మీదుగా విశాఖ, విజయనగరం జిల్లాలకు రాకపోకలు సాగించే వారి ఇబ్బందులు త్వరలోనే తీరనున్నాయి. దేవరాపల్లి-కొత్తవలస రోడ్డు విస్తరణ పనులు అధికారులు చేపట్టారు. ఇప్పటికే 14 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పూర్తి కాగా.. మరో 10 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ చేస్తున్నారు.

Expansion of Devarapalli-Kottavalasa road
దేవరపల్లి-కొత్తవలస రోడ్డు విస్తరణ పనులు
author img

By

Published : Dec 2, 2020, 11:49 AM IST

విశాఖ, విజయనగరం జిల్లాలకు అనుసంధాన మార్గం దేవరాపల్లి-కొత్తవలస రోడ్డు. ఈ రహదారి 24 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. గతంలో కొత్తవలస నుంచి కె.కోటపాడు మండలం ఆనందపురం వరకు 14 కిలోమీటర్లు విస్తరణ పూర్తి చేశారు. ఆనందపురం నుంచి దేవరాపల్లి వరకు 10 కిలోమీటర్లు ఉన్న రోడ్డు విస్తరణ చేయకపోవటంతో కొన్నేళ్లుగా ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు.

రెండు జిల్లాలకు చెందిన వందలాది గ్రామాల నుంచి ప్రజలు ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. గత ప్రభుత్వం హయాంలోనే ఈ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన అనంతరం రీ టెండరింగ్ పిలిచి.. సిఆర్​ఎఫ్ నిధుల నుంచి రూ.15.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో 10 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు పనులు మొదలుపెట్టారు. కొద్దిరోజులుగా ఈ విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి.

రోడ్డు విస్తరణతోపాటుగా కల్వర్టులు, ఇతర నిర్మాణ పనులు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతున్నామని, ప్రస్తుతం రోడ్డు విస్తరణతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు తీరుతాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...

నేటి నుంచి పీఎల్​జీఏ వారోత్సవాలు.. మన్యంలో వెలసిన మావోయిస్టు పోస్టర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.