విశాఖ మన్యంలో గంజాయి నిర్మూలించాలని ఎక్సైజ్ అధికారులు గ్రామగ్రామాన అవగాహన కల్పిస్తున్నారు. గత వారంలో జిల్లా అధికారులతో కమిషనర్ ఎంఎం నాయక్ సమావేశం నిర్వహించి.. గంజాయి నిర్మూలనకు కార్యాచరణ రూపొందించారు. నాట్య కళాకారులతో అవగాహన కల్పిస్తున్నారు. గిరిజనులను ఓ చోట చేర్చి పాటలు, నృత్యాలతో ప్రదర్శనలు ఇస్తున్నారు. మన్యం నుంచి గంజాయిని శాశ్వతంగా నిర్మూలించాలనే తపనతో జి.మాడుగుల మండలం పరదనిపుట్టులో గంజాయిని పండించకుండా.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి గౌరవంగా జీవించవచ్చని సూచించారు.
ఇది కూడా చదవండి.