విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో ఎలక్ట్రికల్ షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చేపట్టారు. గతేడాది మార్చి నుంచి నవంబర్ వరకు తమ జీతాల్లో కోత విధించిన మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి రూ. 18వేలు చొప్పున 36 మందికి బకాయి ఉన్నారని అన్నారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి ఇప్పించాలని.. డివిజనల్ ఎలక్ట్రికల్ అధికారిని కోరారు. అలాగే ఈ సంవత్సరం జూన్ నుంచి బకాయిపడిన వేతనాలను చెల్లించాలని.. లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి..