ETV Bharat / state

ఎన్​-95 మాస్కుల నుంచి మానసిక ఆసుపత్రి వరకూ..! - డాక్టర్ సుధాకర్​పై హైకోర్టు కామెంట్స్

సరైన రక్షణ పరికరాలు కల్పించాలంటూ... అడిగిన ఓ ప్రభుత్వ వైద్యుడి జీవితం విషాదంలోకి వెళ్లింది. ఎన్-95 మాస్కులు అడిగితే.... మానసిక స్థితి సరిగా లేదంటూ... ముద్ర పడింది. వైద్యుడిగా పనిచేసిన అతడి జీవితం... మానసిక వైద్యశాల పాలై... భవిష్యత్తే చీకట్లోకి వెళ్లింది. అయితే తాజాగా హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సుధాకర్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.

doctor sudhakar story from allegations on govt

author img

By

Published : May 20, 2020, 4:56 PM IST

Updated : May 22, 2020, 3:56 PM IST

అసలే కరోనా.... జాగ్రత్తలు తప్పనిసరి.... రక్షణ పరికరాలు కావాలని అడిగాడు ఓ డాక్టర్. ఎన్-95 మాస్కులు ఎందుకు ఇవ్వట్లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్కడే మెుదలైంది వివాదం... అప్పుడే మొదలయ్యాయి వేధింపులు. రోడ్డుపై అర్ధనగ్నంగా తిరిగేలా.. అతడి జీవితం తయారైంది. చివరకు మానసికి స్థితే.. బాగలేదంటూ ముద్రపడింది.

  • ఎన్-95 మాస్కులడిగితే..

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్న సుధాకర్.... కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులకు ఎన్-95 మాస్కులు ఇవ్వడం లేదంటూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అనుభవం లేని వైద్యులతో ఆపరేషన్లు చేయిస్తున్నారని...., ప్రజాప్రతినిధులు సైతం ఆసుపత్రిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ... ఆదేశాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి డాక్టర్ సుధాకర్‌కు కష్టాలు మెుదలయ్యాయి.

  • రోడ్డుపై పడుకోబెట్టి.. ఆటోలో కుదేసి

సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా... మే 16న విశాఖలో పోర్టు ఆసుపత్రి ఎదుట అర్ధనగ్నంగా... డాక్టర్ సుధాకర్ నిరసన వ్యక్తం చేశారు. గొడవ చేస్తున్నట్లు స్థానికులు చెప్పగా... అక్కడికి వెళ్లిన పోలీసులు... ఆయన ఎవరో తెలుసుకోకుండానే చేతులు వెనక్కి విరిచికట్టి రోడ్డుపై పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆటోలో కుదేసి పోలీస్ స్టేషన్‌కు..., అక్కడి నుంచి కేజీహెచ్​కు తీసుకెళ్లారు. సుధాకర్‌ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్‌ వైద్యులు చెప్పడంతో.... పోలీసులు ఆయనను ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్‌పై 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసే సమయంలో వైద్యుడిపై కానిస్టేబుల్‌ కొట్టిన వీడియో బయటికొచ్చింది. మద్యం మత్తులో డాక్టర్ హల్‌చల్‌ చేసినట్టు చెప్పిన విశాఖ సీపీ ఆర్కే మీనా.... వైద్యుడిని కొట్టిన కానిస్టేబుల్‌ను అదే రోజు సస్పెండ్ చేశారు.

  • హైకోర్టే మాకు దిక్కు

కుమారుడి పరిస్థితిపై ఆందోళన చెందిన డాక్టర్‌ సుధాకర్ తల్లి.... విశాఖ కమిషనర్‌ను కలిశారు. తన కుమారుడికి ప్రాణహాని ఉందని తెలిపారు. కోర్టుకు హాజరుపరిచే సమయంలో తన కుమారుడికి ఏమైనా జరగొచ్చంటూ సీపీ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారు. కోర్టుకు వెళ్లే సమయంలో తననూ తీసుకెళ్లాలని ఆర్కే మీనాను గతంలో అభ్యర్థించారు. అయితే తాజాగా హైకోర్టు తీర్పుపై సుధాకర్ తల్లి సంతోషం వ్యక్తం చేశారు. పరువు కాపాడుకోవాలంటే హైకోర్టే మాకు దిక్కు అంటూ వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • రాజకీయ పార్టీల స్పందన

డాక్టర్‌ సుధాకర్‌ అంశం రాష్ట్రంలో రాజకీయంగానూ సంచలనం కలిగించింది. ఆసుపత్రిలో సరైన సదుపాయాలు కావాలని అడిగిన వైద్యుడిని అరెస్టు చేయడమేంటని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. వైద్యుడి జీవితాన్ని నాశనం చేశారంటూ.... ఆరోపణలు గుప్పించాయి. తెలుగుదేశం, భాజపా, జనసేన, సీపీఐ.... డాక్టర్‌ సుధాకర్ ఘటనను తీవ్రంగా ఖండించాయి. డాక్టర్ సుధాకర్ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. అయితే అధికార పార్టీ మాత్రం.... ముఖ్యమంత్రిని డాక్టర్ తీవ్రస్థాయిలో దూషించారని.... సుధాకర్‌ తెదేపాకు కావాల్సిన వ్యక్తి అని ఆరోపించింది.

  • హైకోర్టుకు విషాద గాథ

మే 18న డాక్టర్ సుధాకర్ అరెస్టుపై.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వైద్యుడి హక్కులకు భంగం కలిగించేలా అర్ధ నగ్నంగా ఉంచి అరెస్ట్ చేశారంటూ.. హైకోర్టు దృష్టికి విషయం వెళ్లింది. మరోవైపు తెదేపా మహిళా నేత ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశారు. సంబంధింత వీడియోను జత చేశారు. వీడియోను పరిశీలించిన హైకోర్టు.... డాక్టర్ సుధాకర్ ఘటనను సుమోటోగా స్వీకరించింది. వైద్యుడిని కోర్టు ముందు హాజరుపరచాలని తెలిపింది. మే 20న విచారణ జరిపిన ధర్మాసనం.... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని.. ప్రభుత్వాన్ని ఆదేశించింది. 21వ తేదీ సాయంత్రం వైద్యుడు సుధాకర్ వాంగ్మూలాన్ని విశాఖ జిల్లా జడ్జి... హైకోర్టుకు సమర్పించారు.

  • సీబీఐకి సుధాకర్ కేసు!

శుక్రవారం సుధాకర్‌ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సంబంధిత పోలీసులపై కేసు నమోదు చేసి సీబీఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. 8 వారాల్లోపు నివేదికను ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

  • పోలీసుల తీరు అమానుషం:ఐఎంఏ

మే 19న డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌- ఐఎంఏ.... ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది. సుధాకర్‌ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని సీఎంకు తెలిపింది. ముఖ్యమంత్రిపై వైద్యుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని.. వైద్యుడి పట్ల ఇలా ప్రవర్తించడం మనోవేదనకు గురి చేస్తోందని జగన్‌కు రాసిన లేఖలో పేర్కొంది. పోలీసులపైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదే విషయంపై.. రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.

డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో జరుగుతున్న పరిణామాలు... ఆంధ్రప్రదేశ్‌లో వ్యక్తి స్వేచ్ఛ, భావప్రకటన అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Last Updated : May 22, 2020, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.