విశాఖ జిల్లాలో సగం గిరిజన ప్రాంతంలోనే ఉంది. మొత్తం 11 మండలాల్లో విస్తరించిన గిరిజన ప్రాంతం జనాభా పరంగా, పదో వంతు కంటే తక్కువగానే ఉంది. ఇక్కడ గిరిజనులను భూమి హక్కులను పట్టాలుగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. అటవీ హక్కుల చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశ మయ్యింది.
అటవీ హక్కుల చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అటవీ భూములపై వ్యక్తిగత హక్కు పత్రాలను ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం జిల్లాలో 21, 144 ఎకరాలకు 13, 172 మందికి వ్యక్తిగత హక్కు పత్రాలను ఇవ్వనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వ్యక్తిగత హక్కు పత్రాలను, సామూహిక హక్కు పత్రాలను అందజేయనున్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. అడవిని నమ్ముకొని జీవిస్తున్న మరింత మంది నిరుపేద గిరిజనులకు వ్యక్తిగత హక్కు పత్రాలను ఇవ్వడానికి కూడా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. టైటిల్ డీడ్లను ఆదివాసీలకు సులభంగా అర్థమయ్యేలా, సరళంగా, తప్పులు లేకుండా తయారీ చేయాలని తాహసీల్డార్లకు బాధ్యతలు అప్పగించారు.
ఇవీ చూడండి... : ఇసుక లభ్యత పై విశాఖ జాయింట్ కలెక్టర్ సమీక్ష