విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇంటింటికీ మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. మొదటి విడతగా వచ్చిన 25 వేల మాస్కులను వాలంటీర్లకు ఆయన అందజేశారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి మూడేసి మాస్కుల చొప్పున అందించాలని సీఎం ఆదేశించారన్నారు.
ఆ మేరకు వాలంటీర్లతో పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే వివరించారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి, వైకాపా నాయకులు మందపాటి జానకి రామ రాజు, గొర్లి సూరిబాబు, జాజుల రమేష్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
పాతగోపాలపట్నానికి తీరిన కష్టం.. గంటల వ్యవధిలోనే సబ్‌వే నిర్మాణం