నవరాత్రి వేడుకల్లో భక్తులు అత్యధికంగా పాల్గొంటున్నారు. కొవిడ్ దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూనే... అమ్మవారికి నీరాజనాలు అందిస్తున్నారు. దీనిలో భాగంగానే విశాఖ జిల్లా నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వరి ఆలయంలోనూ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం లోనూ ప్రత్యేక పూజలు కొనసాగిస్తున్నారు. శాంతి హోమాలు, చండీ యాగాలు, మృత్యుంజయ హోమాలు... ఆధ్యాత్మిక కార్యక్రమాలు పరిమితమైన భక్తులతో భౌతిక దూరం పాటిస్తూ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులను అలరిస్తోంది. నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వరి ఆలయంలో మూడో రోజున అమ్మవారు బాలాత్రిపురసుందరి రూపంలో విశేషంగా ఆకట్టుకుంది. మహిళలు మొక్కులు తీర్చుకోని ప్రత్యేక పూజలను కొనసాగిస్తున్నారు. మరో వైపు భవానీ మాల ధారుల భక్తి గీతాల ఆలాపన తో ఆలయాలు హోరెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: