కార్పొరేట్ కళాశాల పథకం బిల్లుల(corporate collages schem bills) చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం.. ఎంతోమంది పేద విద్యార్థుల ఉన్నత చదువులపై ప్రభావం చూపుతోంది. ఇంటర్మీడియట్ పూర్తయినా.. ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదన్న కారణంగా విద్యార్థులకు కళాశాలలు ధ్రువపత్రాలు ఇవ్వటం లేదు. విద్యార్థులు కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కార్పొరేట్ కళాశాల పథకం కింద 2019లో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల్లో చేరిన 8 వేల 200 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు.
కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలు మాత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. ఆ మొత్తాన్ని విద్యార్థులే చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. అప్పటివరకు సర్టిఫికెట్లు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నాయి. ఇంటర్ తరువాత వివిధ కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ ఫీజుల వివాదంతో ఆందోళన చెందుతున్నారు. రూ.70, 80 వేల రూపాయలు ఫీజు కట్టాలంటే తమ పరిస్థితేంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఫీజు చెల్లించలేమని ప్రభుత్వం ముందే చెబితే ప్రైవేటు కళాశాలల్లో చేరేవాళ్లం కాదంటున్నారు.
కార్పొరేట్ కళాశాల పథకం ద్వారా అందించే ఫీజుల విషయంలో మొదటి నుంచి ఉన్నతాధికారులు అలసత్వం వ్యవహరిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త కిషోర్ చెబుతున్నారు.
ఇదీ చదవండి: