విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా దారేలా సర్పంచ్ పాంగి పాండు రంగ స్వామి తన పంచాయతీ పరిధిలో కరోనా లక్షణాలు ఉన్న వారికి ధైర్యం చెబుతున్నాడు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.
అలాగే.. అనారోగ్యంతో బాధ పడే వారు.. విధిగా వైద్య సిబ్బందికి సమాచారాన్ని ఇవ్వాలని అన్నారు. గిరిజనులకు మాస్క్ ధరించటం, శానిటైజర్ వినియోగంపై అవగాహన కల్పించారు. తాను సైతం పీపీఈ కిట్ ధరించి గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ జల్లుతూ కరోనా రోగులకు దైర్యం చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.