ఉల్లి ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం కార్యకర్తలు విశాఖలో ఈ రోజు ఆందోళన చేపట్టారు. కొవిడ్ ను తట్టుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తూనే... మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతున్నా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ అక్కయ్యపాలెం రైతు బజార్ ఎదుట సీపీఎం కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉల్లిపాయల ధరలు మిన్నంటాయని... సామాన్యులకు సబ్సిడీ ధరల్లో అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: