విశాఖ జిల్లా నర్సీపట్నంలో 45 సంవత్సరాలు నిండిన వారికి తొలి విడత వ్యాక్సిన్ అందిస్తామని అధికారులు ప్రకటించారు. ఇది తెలిసి.. వ్యాక్సిన్ తీసుకోని వారంతా టీకా కేంద్రాల వద్ద బారులు తీరారు. టీకా కోసం వచ్చిన వారు క్యూలైన్లలో వేచి ఉండకుండా ఇష్టానుసారం వ్యవహరించారు. భౌతిక దూరం పాటించలేదు.
పట్టణంలోని పలు టీకా కేంద్రాల్లో తోపులాట జరిగింది. కొంతమంది వృద్ధులు కిందపడిపోయారు. వ్యాక్సిన్ కోసం ముందు మేమంటే.. మేము అంటూ వివాదాలు జరిగాయి. వారిని అదుపు చేసేందుకు పోలీసులు కానీ, వైద్య సిబ్బంది కానీ అక్కడ లేరు. ఫలితంగా.. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. టీకా కేంద్రాల వద్ద తగిన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు.
ఇదీ చదవండి: