ETV Bharat / state

కరోనా కంటే భయమే చెడ్డది.. జాగ్రత్త.. ధైర్యమే రక్ష! - కరోనా లక్షణాలు న్యూస్

కరోనా వైరస్‌ సోకిన వారు మానసికంగా ధృడంగా ఉంటే వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆందోళన చెందొద్దని చెబుతున్నారు. ప్రస్తుత వైద్య విధానంలో మార్పుల వల్ల వేగంగా నయమయ్యే అవకాశముందని, కుటుంబ సభ్యులు కూడా రోగులకు మనోధైర్యం కల్పించాలంటున్నారు.

కరోనా కంటే భయమే చెడ్డది.. జాగ్రత్త.. ధైర్యమే రక్ష!

author img

By

Published : Apr 20, 2021, 5:42 PM IST

కరోనా కంటే భయమే చెడ్డది.. జాగ్రత్త.. ధైర్యమే రక్ష!

కొవిడ్ మహమ్మారి గతేడాది కంటే వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండగా.. అత్యవసర స్థితిలో చికిత్స పొందుతున్నవారూ ఎక్కువగానే ఉన్నారు. కొవిడ్‌ బాధితులు.. మానసికంగా కుంగిపోవడం వల్లే బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే విశాఖ కేజీహెచ్​లో ఓ మహిళ భవనంపై నుంచి దూకి చనిపోవటం కలిచి వేసిందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా కరోనాపై అవగాహనతో మెలగాలని సూచిస్తున్నారు. వైరస్ సోకినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే కోలుకోవచ్చని చెబుతున్నారు.

కరోనా సోకిన వారితో కుటుంబ సభ్యులు, స్నేహితులు సానుకూలంగా ప్రవర్తించి.. వారికి అండగా నిలవాలని వైద్యులు సూచిస్తున్నారు. మనో ధైర్యంతో ఉంటే వ్యాధిని జయించవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

వైరస్‌ సోకిన వెంటనే ఆందోళన చెందకుండా.. వ్యాధిపై అవగాహన పెంచుకుని.. తగిన చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: కరోనా బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్న ఫ్లాట్‌కు తాళం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.