విశాఖ జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కరోనా అలజడి నెలకొంది. దస్తావేజులేఖరుల్లో ఒకరికి కొవిడ్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో.. మిగిలిన వారంతా భయాందోళనకు గురయ్యారు. దీంతో రిజిస్ట్రేషన్లపై ప్రభావం పడింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. సోమవారం నుంచి కార్యాలయం మూసివేస్తామని కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
చోడవరం పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకినట్లు తెలింది. దీంతో ఆ కానిస్టేబుల్ ప్రైమరీ కాంటాక్టులు మరో ఇద్దరు కానిస్టేబుల్ లకు కొవిడ్ పరీక్షలు చేయించారు. శనివారం నాటికి చోడవరం మండలంలో 37 కరోనా పాజిటివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది చోడవరం పట్టణవాసులే ఉన్నారు.
ఇదీ చదవండి : శిరోముండనం చేసిన యువకుడిని.. ఆ రోజు రాత్రి ఇలా కొట్టారా?