ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: మధ్యాహ్నానికల్లా మూతపడుతున్న దుకాణాలు - stores closed at afternoon latest news

విశాఖలో కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ దుకాణాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకే దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. ద్వారకా నగర్, శంకర మఠం రోడ్ , దాబా గార్డెన్స్ వాణిజ్యపరంగా దుకాణాలు సైతం మధ్యాహ్నం కల్లా మూతపడుతున్నాయి.

Corona Effect Stores closed at afternoon
కరోనా ఎఫెక్ట్​ మధ్యాహ్నానికల్లా మూతపడుతున్న దుకాణాలు
author img

By

Published : Jul 21, 2020, 11:43 AM IST

కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం విశాఖ జిల్లాలో దుకాణాలు మధ్యాహ్నం కల్లా మూతపడుతున్నారు. ప్రతిరోజు 150 నుంచి 200 వరకు కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో గత 24 గంటల్లో 209 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1125 కి చేరింది. 1965 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య 53 గా ఉంది. గత వారం రోజులుగా కరోనా కేసుల పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆయా సెంటర్లలో ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలని తెలపడంతోపాటుగా పలు అంశాలపై కలెక్టర్ వినయ్ చంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి...

'మద్యం వద్దు - కుటుంబం ముద్దు' అనే నినాదంతో కరపత్రాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.