లాక్ డౌన్ నేపథ్యంలో పనుల్లేక అల్లాడుతున్న పేదవారిపై ప్రభుత్వం విద్యుత్ బిల్లుల భారం మోపుతోందని విశాఖ జిల్లా పాయకరావుపేట కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నేతలు అభిప్రాయపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఇదీ చదవండి : రైతుకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్