కలెక్టర్ వినయ్ చంద్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
ఉదయం 11 గంటలకు 41 శాతం పోలింగ్ నమోదు అయిందని చెప్పారు. ఏ సమస్య వచ్చినా తెలిపేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ తో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశామన్నారు.
విశాఖ రేంజ్ పరిధిలోని జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు.
ఇదీ చదవండి: 'పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేశాం'