ETV Bharat / state

రేషన్ సరకుల తూకంలో వ్యత్యాసాలపై పౌర సరఫరాల శాఖ అధికారుల విచారణ - Civil Supplies officials investigate on differences in weighing of groceries

విశాఖ జిల్లా దేవరాపల్లి నిత్యావసర సరకుల గోదాములో.. తూనికల్లో తేడాలొస్తున్నాయని అందిన ఫిర్యాదుపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు విచారణ చేపట్టారు. గిడ్డంగిలో కాటాపై బియ్యం బస్తాలు తూకం వేయించగా.. వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. దీంతో కొత్త కాటా ఏర్పాటు చేసి రేషన్ డిపోలకు సరకులను పంపించారు.

Civil Supplies Department officials investigate on differences in weighing of groceries
సరకుల తూకంలో వ్యత్యాసాపై పౌర సరఫరాల శాఖ అధికారులు విచారణ
author img

By

Published : Mar 15, 2021, 4:15 PM IST

సరకుల తూకంలో వ్యత్యాసాలపై పౌర సరఫరాల శాఖ అధికారులు విచారణ జరిపారు. విశాఖ జిల్లా దేవరాపల్లి నిత్యావసర సరకుల గోదాములో.. తూనికల్లో తేడాలొస్తున్నాయని అందిన ఫిర్యాదుపై.. జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ వెంకటరమణ, అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వరరావు విచారణ చేపట్టారు. తూకంలో తేడాలపై ప్రశ్నిస్తే.. తమపై కేసులు పెడతామని గోదాము ఇంఛార్జి బెదిరిస్తున్నారని.. రేషన్ డీలర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా అధికారుల బృందం డీలర్ల సమక్షంలో విచారణ చేపట్టారు.

గిడ్డంగిలో కాటాపై బియ్యం బస్తాలు తూకం వేయించారు. తూకంలో వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఆ కాటా స్థానంలో కొత్తది ఏర్పాటు చేసి, బియ్యం తూకం వేయించి.. రేషన్ డిపోలకు సరకులు పంపించారు. దీంతో సమస్య పరిష్కారమైంది.

ఇదీ చదవండి:

రైతన్నల రెక్కల కష్టం.. ఆదుకోని ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.