13 మంది మృతికి కారణమై పెను విధ్వంసం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖలో పౌర, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పౌర, ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను మూసివేసి యజమానులను అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రజాసంఘాల నాయకులు, మహిళలు పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి... కేజీహెచ్‌లో ప్రతీ పడకకు ఆక్సిజన్ సదుపాయం