విశాఖ జిల్లా మద్దిపాలెంలో సీఐటీయూ నేతలు నిరసన వ్యక్తం చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత గనులు కేటాయించాలని నినాదాలు చేశారు. కేంద్రం.. ప్రైవేటీకరణ చర్యలు తక్షణమే అపాలన్నారు. లేకపోతే.. పెద్దఎత్తున కార్మికులను, విద్యార్థి, మహిళా సంఘాలను కలుపుకుని ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నెల 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల నేతలు, అఖిల భారత నాయకులతో కలిసి స్టీల్ ప్లాంట్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: