ETV Bharat / state

Simhadri Appanna: అప్పన్న ఆలయంలో ముందస్తు ఏర్పాట్లలో విఫలం.. భక్తుల ఆగ్రహం - సింహాద్రి అప్పన్న

Chandanotsavam: సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా స్వామి నిజరూపాన్ని చూసేందుకు సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఐతే వీఐపీల తాకిడితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటలకొద్దీ క్యూలైన్లలోనే వేచి ఉన్నారు. సౌకర్యాల ఏర్పాట్లపై మంత్రులను నిలదీశారు. ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటుగా గంటా శ్రీనివాస​రావు స్పందించారు. సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Simhadri Appanna
హాద్రి అప్పన్న
author img

By

Published : Apr 23, 2023, 4:10 PM IST

Simhadri Appanna Chandanotsavam: సింహాద్రి అప్పన్న దర్శనానికి ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ముందస్తు ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలం అయ్యారంటూ భక్తులు మండిపడుతున్నారు. సౌకర్యాల ఏర్పాట్లపై భక్తులు దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు బొత్స సత్యనారాయణను నిలదీశారు. అప్పన్న చందనోత్సవంలో ఏర్పాట్లపై తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు గంట శ్రీనివాస్​రావు స్పందించారు. భక్తలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

బాధ్యతా రాహిత్యంతోనే: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తుల ఇబ్బందులు బాధ కలిగించాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతోనే అప్పన్న భక్తులకు ఇంత కష్టమని మండిపడ్డారు. దశాబ్దాలుగా లేని ఇబ్బందులు, రాని సమస్యలు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. దేవస్థానాలను వివాద కేంద్రాలుగా మార్చడం తప్ప మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు.

  • సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తుల ఇబ్బందులు బాధ కలిగించాయి. ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంతోనే అప్పన్న భక్తులకు ఇంత కష్టం. దశాబ్దాలుగా లేని ఇబ్బందులు,రాని సమస్యలు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి?దేవస్థానాలను వివాద కేంద్రాలుగా మార్చడం తప్ప.. మీరేం చేస్తున్నారు? pic.twitter.com/pW5e24JWw5

    — N Chandrababu Naidu (@ncbn) April 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గంటా శ్రీనివాసరావు ట్వీట్: అప్పన్న భక్తుల ఇబ్బందులపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ట్వీట్టర్ ద్వారా స్పందించారు. సీఎం మాదిరిగానే అధికారులు తయారయ్యారని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందినట్లు గంటా పేర్కొన్నారు. ఏర్పాట్లలో అడుగడుగునా అధికారుల వైఫల్యం కనిపించిందని గంటా మండిపడ్డారు. ఘాట్‌రోడ్డుపై వందలాది కార్లు గంటలకొద్దీ నిలిచాయని.. భక్తులకు సౌకర్యాలు కల్పించకుండా 5 కి.మీ క్యూలైన్లలో తిప్పుతున్నారని ఆరోపించారు. ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహించలేనివారు.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని గంటా మండిపడ్డారు. సింహాద్రి అప్పన్ననే తన భక్తులను కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంయమనం పాటించి భక్తులు అప్పన్న దర్శనాలు చేసుకోవాలని గంటా సూచించారు.

  • యధా రాజా ... తథా ప్రజా. ముఖ్యమంత్రి ఎలానో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా అలానే తయారయ్యారు. ఏడాదికి ఒక్కరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన సింహాచల అప్పన్న నిజరూప దర్శనం - చందనోత్సవం సందర్బంగా ఏర్పాట్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అడగడుగానా అధికారుల…

    — Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) April 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉదయం నుంచి భక్తుల ఇక్కట్లు: సింహాద్రి అప్పన్న కొండపైకి వెళ్లెందుకు భక్తులు ఉదయం నుంచి బస్సుల కొరకు ఎదురుచూశారు. బస్సుల కొరతతో చందనోత్సవ భక్తుల ఇక్కట్లు పడ్డారు. ఈ నేపథ్యంలో కాసేపటివరకు సింహగిరి ఘాట్‌రోడ్డులో వాహన రాకపోకలు స్తంభించాయి. బస్సులు నిలిచిపోవడంతో కొంత మంది భక్తులు కాలినడకన వెళ్తారు. కొండపైకి భారీగా వీఐపీ వాహనాలు అనుమతించడంతో ఇబ్బందులు తలెత్తాయి. వీఐపీల దర్శనం కోసం ఆలయ విధుల్లో ఉన్న సిబ్బందిని, భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది విధుల నుంచి బయటకు వచ్చారు. ప్రముఖులకు అంతరాలయ దర్శనం చేయిస్తున్న కలెక్టర్, దేవాదాయ కమిషనర్ సామాన్యులను పట్టించుకోవడం లేదంటూ భక్తులు మండి పడ్డారు. దక్షిణ ద్వారం నుంచి పోలీసులు దర్శనాలు చేయిస్తున్నారని భక్తుల ఆరోపించారు. ఏర్పాట్లపై దేవస్థానం సిబ్బంది, పోలీసులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు, సిబ్బందితో భక్తుల వాగ్వాదం చోటు చేసుకుంది. రూ.1500 లైన్‌లోకి భక్తులను పంపుతున్న సమయంలో తోపులాట చోటు చేసుకుంది. సింహాచలం ఆలయం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద తోపులాట నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.