చలసాని శ్రీనివాస్, అధ్యక్షుడు, ప్రత్యేక హోదా సాధన సమితి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా ప్రయోజనాలను కాపాడేవారికే ఓటు వేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు.దొంగలు, అవినీతిపరులకు ఓటు వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 'ప్రచారభేరి' పేరిట తన బృందసభ్యులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఓటుపైచైతన్యాన్ని పెంపొందిస్తానన్నారు.శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించి ఓటరు చైతన్యం కోసం కృషి చేశానని అన్నారు.
ఇవి చదవండి
'దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయండి'