విశాఖ- చెన్నై పారిశ్రామిక నడవాకు ఏడీబీ(ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు) అభివృద్ధి ప్రణాళిక సిద్ధమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. ఈస్ట్‌కోస్ట్ ఆర్థిక కారిడార్‌లో భాగంగా కేంద్ర ప్రతిపాదనలో అభివృద్ధి కేంద్రాలుగా విశాఖ, మచిలీపట్నం, చిత్తూరు, దొనకొండ గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలుత విశాఖ, చిత్తూరును చేపట్టాలని ఏపీ నిర్ణయించిందని... ఈ రెండు నగరాల కోసం ఇప్పటికే ఏడీబీ మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసిందని గోయల్ వెల్లడించారు.
ఇదీ చదవండి : కేంద్ర 'రైతు బంధు'లో 2.69 లక్షల మందికి నిరాశ