రాష్ట్రంలో 3 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. దీనిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖ జిల్లా పాడేరు, గుంటూరు జిల్లా గురజాల, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి లేఖ వచ్చింది. కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ కళాశాలలను నెలకొల్పనున్నారు.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త - ఏపీలో మెడికల్ కళాశాలలు
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మూడు చోట్ల వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ పంపింది.
jagan and modi