CCTV footage of Jnanapuram accident : విశాఖలోని జ్ఞానాపురం బీఆర్టీఎస్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందడం నగరవాసుల్లో ఆందోళన కలిగించింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో.. ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. మురళీనగర్ పట్టాభిరెడ్డితోట ప్రాంతానికి చెందిన దాలబాని దినేశ్ కుమార్ (27) పోర్టులో సివిల్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగిసిన తర్వాత ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు.
పాత అడివి వరం ప్రాంతానికి చెందిన రాజనాల రామిరెడ్డి (21), మిత్రుడు సాయి సాగర్‌తో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై అతి వేగంతో వస్తున్నాడు. జ్ఞానాపురం వద్దకు వచ్చేసరికి ఓ వ్యక్తి లిఫ్ట్ అడగడంతో.. అతడ్ని ఎక్కించుకునేందుకు దినేశ్ ఆగడంతో.. వేగంగా వస్తున్న రామిరెడ్డి వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న దినేశ్ కుమార్ వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో దినేశ్ కుమార్, రాజనాల రామిరెడ్డి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
రాజనాల స్నేహితుడు సాయి సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే పశ్చిమ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, కంచరపాలెం సీఐ విజయకుమార్ హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గాయపడ్డ సాయిసాగర్‌ను ఆసుపత్రిలో చేర్పించారు.
ఇవీ చదవండి: