విశాఖలో పేకాట ఆడుతున్న అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులపై కేసు నమోదయింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి నుంచి రూ.1,85,000 స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న బృందంలో జీకే వీధి తహసీల్దార్ బి.శ్రీధర్, తాళ్లవలస ఎస్ఈబీ సీఐ రవి కుమార్, కో ఆపరేటివ్ సీనియర్ ఇన్స్పెక్టర్ డి. లక్ష్మణరావు, రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాజా బహదూర్, రిటైర్డ్ ఎస్సై కౌసల్య కుమార్, కాంట్రాక్టర్ వై.సూర్యనారాయణ, పెయింటర్ కృష్ణ ప్రైవేటు ఉద్యోగి కుమారస్వామి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి