ETV Bharat / state

జిల్లాలో ప్రారంభానికి నోచుకోని నూతన భవనాలు

author img

By

Published : Jul 24, 2020, 7:06 AM IST

విశాఖ జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ భవనాలు.. కరోనా ప్రభావంతో ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడింది. వీటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

vishaka district
జిల్లాలో ప్రారంభానికి నోచుకోని నూతన భవనాలు

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన అనేక భవనాలు కరోనా ప్రభావంతో ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడింది. వీటి సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. సుమారు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం ఇటీవలే సాంకేతిక పరీక్షలు పూర్తిచేసుకుని సిద్ధమైంది.

అలాగే స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వాయిస్ కేంద్రం పరిస్థితి అంతే ఇది నిర్మాణం పూర్తైనా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ప్రకృతి వైద్యం యోగా తదితర సదుపాయాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని దీని నిర్మాణానికి తలపెట్టారు సిబ్బంది వైద్యుల నియామకానికి వీలుగా అన్నీ సిద్ధం చేశారు

స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ మైదానంలో సుమారు రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన ఆధునిక ఆదర్శ పట్టణ పోలీస్ స్టేషన్ సైతం ఇప్పుడు దిక్కులు చూస్తుంది. సిబ్బంది సకల సౌకర్యాలతో పాటు నేర పరిశోధన విభాగ తో ఆధునిక సాంకేతిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నికల కోడు ఇప్పుడు కరోనా కారణంగా ఇవి ప్రారంభానికి నోచుకోలేదు.

నర్సీపట్నం పురపాలక ప్రజలు వీటిపై ఆశలు వదులుకున్నారు. త్వరలోనే వీటిని ప్రారంభోత్సవం చేసి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. వీటి ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారులతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.

ఇదీ చదవండి మన్యంలో వినియోగించిన పీపీఈ కిట్ల కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.