విశాఖ జిల్లా పాడేరులో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి వనుగుపల్లికి చెందిన తండ్రీ కొడుకులను వెనుక నుంచి ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. కారులో ప్రయాణిస్తున్నవారు పరారీలో ఉన్నారు. మద్యం మత్తులో వాహనం నడిపి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ప్రమాదానికి కారణమయ్యాడని.. అతన్ని వెంటనే అరెస్టు చేయాలని బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: