విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి వ్యాపారులు విరాళాలు అందించారు. అనకాపల్లి ముప్పన సిల్క్స్, ఎంఎస్ రావు షాపింగ్ మాల్ యజమానులు రూ.4 లక్షల నగదు విరాళంగా అందజేశారు. ఆసుపత్రిలో 75 ఆక్సిజన్ బెడ్స్ పై కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వివరించారు. కార్యక్రమంలో అనకాపల్లి ఆర్డీఓ సీతారామారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: