విశాఖలో గ్రామవాలంటీర్ల శిక్షణా తరగతులు ముగిశాయి. చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే గ్రామ వాలంటీర్లు... ప్రభుత్వంలో ఒక భాగమన్న విషయాన్ని అంతా గుర్తించాలని మంత్రి అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. ఎలాంటి పక్షపాత ధోరణికి, అవినీతికి తావులేకుండా గ్రామ వాలంటీర్లు నిజాయితీతో పనిచేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి